![]() |
![]() |

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఆరుగురు కామన్ పీపుల్ గెలిచారు. హోల్డ్ 16 మంది ఉన్నారు. వాళ్లకు సెకండ్ రౌండ్ సెలెక్షన్స్ నిర్వహించారు. వీళ్ళ కోసం డేర్ ఆర్ డై లెవెల్ 1 పేరుతో వీళ్లకు టాస్కులు ఇచ్చారు హోస్ట్ అండ్ జడ్జెస్. ముందు ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు జడ్జ్ నవదీప్. స్ట్రాంగ్ భావాలున్న వ్యక్తి అని సంభోదిస్తూ హరీష్ ని స్టేజి మీదకు పిలిచాడు. ఐతే అతనికి పోటీగా శ్రీతేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. "ఓహో అతను సాఫ్ట్ గా ఉన్నాడని తొక్కేద్దామని చూస్తున్నారా" అన్నాడు ..దాంతో హరీష్ "కాదు గ్రూప్ డిస్కషన్ ఐపోయాక కూడా అతని లిమిట్ దాటి పర్సనల్ అయ్యాడు. కొంచెం మాట్లాడదామని" అని చెప్పాడు సీరియస్ గా. "మీ పర్సనల్ రీజన్స్ ని మా మీద రుద్దకండి..ఇంకొకళ్ళను సెలెక్ట్ చేసుకోండి" అన్నాడు నవదీప్. తర్వాత శ్రీజను సెలెక్ట్ చేసుకున్నాడు.
కానీ నవదీప్ మాత్రం తనకు హరీష్ అషన్స్ నచ్చక సాయి కృష్ణని పిలిచాడు. ఫస్ట్ టాస్క్ ని బాగా హైప్ చేశారు. ఇక్కడ ఓడిపోతే ఇక డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోవడమే అని చెప్పారు జడ్జెస్.ఇక హరీష్ అలియాస్ హృదయమానవ్ - సాయి కృష్ణ మధ్య పెట్టిన టాస్క్ సగం జుట్టు తీసేసుకోవాలని చెప్పాడు నవదీప్. ఇక ఆ ట్రిమ్మర్ ని ఇద్దరి మధ్య పెట్టాడు. వెంటనే హృదయ మానవ వచ్చి ఆ ట్రిమ్మర్ ని లాక్కుని సగం జుట్టు తీసేసుకుని అరగుండుతో టాస్క్ విన్ అయ్యాడు. "మరి మీ ఆవిడ ఈ అరగుండు చూసి ఎందుకు ఇదంతా మీకు" అని అడిగింది. "ఈ జుట్టు ఉన్న సగభాగం నా వైఫ్ ..ఈ అరగుండు నేను. నా భార్య నాలో సగం" అని చెప్పాడు. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు.
![]() |
![]() |